యాంటీబాడీతో డెంగీకి చెక్
ప్రాణాంతక డెంగీ వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శరీరంలో ప్రవేశపెట్టే యాంటీబాడీస్ రక్తంలో నెలల తరబడి ఉంటాయని, తాము కనుగొన్న తరహా యాంటీబాడీస్‌ను గర్భంలోకి ప్రవేశపెట్టడం ద్వారా పుట్టబోయే పిల్లలు డెంగీ బారిన పడకుండా అడ్డుకోగలమని వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖేల్ డైమండ్ చెప్పారు. ఎలుకల్లో ఈ యాంటీబాడీస్‌ను ప్రవేశపెట్టి తాము పరీక్షించామన్నారు. డెంగీతోపాటు కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని ఈ యాంటీ బాడీస్ అడ్డుకున్నాయని చెప్పారు.








