ఫ్లోరిడాలో అన్నమయ్య సంకీర్తనలు…
ఫ్లోరిడా తెలుగు సంఘం అమెరికా ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్మాత్మికవేత్త అమ్మ కొండవీటి జ్యోతిర్మయిచే అన్నమయ్య సంకీర్తనలు, తెలుగు సాహిత్యంపై శిక్షణ శిబిరం నిర్వహించినట్లు సంఘం ప్రెసిడెంట్ భానుప్రశాశ్ ధూళిపాళ్ల తెలిపారు. ఈ శిక్షణలో అన్ని వయసుల వారు పాల్గొన్నారని, శిక్షణ అనంతరం సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతిర్మయి మాట్లాడుతూ అన్నమయ్యను భక్తి అనే మూసలో కాక, తెలుగు సాహిత్యం, సంకీర్తనలలోని అర్థాలను విపులంగా వారికి చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మూర్తి ఎల్లా, జానకి నారాయణన్, మాధవి శేఖరం, ప్రహ్లాద మాడభూషి, సూజాత నీలం, గాంధీ నిడదవోలుతో పాలు పలువురు పాల్గొన్నారు.













