ఎన్నారైలకు మేకప్ నేనే వేశా…సుమ
1995లో న్యూజెర్సిలో తీసిన ‘గీతాంజలి’ సీరియల్ నాకు మొదటి సీరియల్ అయినా నాకు మరవలేని ఎన్నో అనుభవాలను కలగజేసిందని ఆ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన ప్రముఖ యాంకర్ సుమ అన్నారు. ఆ సీరియల్లో నటించడంతోపాటు అక్కడ ఉన్న ఎన్నారైలతో నాకు ఏర్పడిన పరిచయం నిజంగా మరచిపోలేనిదని చెప్పారు. ఆ చిత్రంలో నటించిన ఎన్నారైలు తమ ఉద్యోగబాధ్యతలను నిర్వహిస్తూనే రాత్రి సమయాల్లో ఈ సీరియల్లో నటించారని ఆమె చెప్పారు. అయితే వారికి ఇదే తొలి షూటింగ్ కాబట్టి వారికి అవసరమైన మేకప్‌ను తానే వేశానని చెప్పారు. అప్పుట్లో వింటర్ సీజన్ కాబట్టి, మంచు ముద్దల్లో లంగా ఓణీతో ఈ సీరియల్లో నటించడం ఇప్పటికీ తనకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందని చెప్పారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన కూడా ఈ సీరియల్ నిర్మాణం జరిగిందని, ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ లేకపోయినా ఈ సీరియల్ ద్వారా దానిని ఇప్పటికీ కూడా చూడవచ్చని సుమ చెప్పారు. ఈ సీరియల్ అప్పుట్లోనే బాగా విజయాన్ని సాధించిందని ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియావారు యూట్యూబ్‌లో మరోసారి ఈ?సీరియల్‌ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సీరియల్‌ను తీసిన చెన్నూరి సుబ్బారావు, ఆయన సోదరుడు బాలకృష్ణ, దర్శకుడు దామరాజు కుమార్‌కు మరోమారు ధన్యవాదాలను తెలియజేస్తున్నట్లు సుమ పేర్కొన్నారు.













