స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఏ చీర కట్టుకోమంటారు?
భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఏ చీర కట్టుకోవాలో అర్థం కావడం లేదని, ఈ నాలుగింటిలో ఒకటి ఎంపిక చేసి పెట్టవలసిందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంలోని దౌత్యవేత్త మేరీ కే కార్ల్సన్ నెటిజన్లును కోరారు. తనకు బాగా నచ్చిన నాలుగు చీరలు కట్టుకుని ఫోటోలు దిగి, ఏది కట్టుకోమంటారో చెప్పమని కోరుతూ ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ చీరలు కట్టుకుని తాను నడిచిని వీడియోను కూడా మేరీ ట్వీట్ చేశారు. తాను చీరలకు కొనడానికి వెళ్లినప్పుడు కూడా భారతీయ వస్త్రాలు తనకు బాగా నచ్చాయని వాటిని వీడియో తీసి ఆమె ట్విట్టర్లో పెట్టారు. ఈ విషయంలో ఆమెకు నెటిజన్లు సహాయం చేయడమే కాకుండా ఇలా భారత సంప్రదాయాన్ని గౌరవిస్తున్నందుకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.








