సెప్టెంబర్ 2,3 తేదీల్లో అమెరికా కూచిపూడి సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్ భాష, సాంస్కృతిక శాఖ సహకారంతో సిలికానాంధ్ర సంస్థ అమెరికాలో అమెరికా కూచిపూడి డ్యాన్స్ కన్వెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 2,3 తేదీల్లో సిలికానాంధ్ర యూనివర్సిటీలోని డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవన్లో జరిగే ఈ కార్యక్రమం కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కళారత్న శ్రీమతి బాల కొండల్రావు ఈ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ప్రత్యేక శిక్షణను కూడా ఇస్తున్నారు. ఇతర వివరాలకు సంస్థ వెబ్సైట్ను చూడండి.
http://akdc.siliconandhra.org/













