అమెరికా ప్రకటన … కిమ్‌కు ముచ్చెమటలు!
యుద్ధ వాతావరణం తగ్గినట్లే తగ్గి మళ్లీ రాజుకోవడంతో ఉత్తరకొరియాను దృష్టిలో ఉంచుకుని ఓ న్యూక్లియర్ సూపర్ బాంబ్‌ను పరీక్షించినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ మాటలతో వినే రకం కాదు అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మరో వైపు అమెరికా నేవీ కూడా ఓ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. హవాయిలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు పసిఫిక్ మిస్సైల్ రేంజ్ ఫెసిలిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, వాయుసేన పరీక్షించిన బీ61-12 బాంబును కిమ్ దేశాన్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అమెరికా ప్రకటన కిమ్ దేశాన్ని ఆందోళనలోకి నెట్టింది.













