35 లక్షలు పలికిన ఐన్ స్టీన్ లేఖ
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లేఖ వేలంలో రూ.35 లక్షలు పలికింది. అమెరికాలోని లోవాకు చెందిన సైన్స్ టీచర్ ఆర్థర్ కన్వర్స్ లేవనెత్తిన సందేహాలకు ఐన్‌స్టీన్ రెండు పేజీల లేఖలో సమాధానం ఇచ్చారు. అందులో ఎలక్ట్రానిక్ సిద్దాంతం, ప్రత్యేక సాపేక్ష అంశాలను వివరించారు. లేఖను ఉంచిన కవర్‌పై రూం నంబర్ 115 ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ, ప్రిన్స్టన్, న్యూజెర్సీ అని రాసి ఉన్నది. లేఖలో ఐన్‌స్టీన్ సంతకం ఉన్నది. 1953 నుంచి చాలా ఏండ్లపాటు ఆ లేఖ కన్వర్స్ కుటుంబీలకుల వద్ద ఉన్నది. దానిని నేట్ డీ శాండర్స్ తాజాగా వేలం వేసింది. 53 వేల డాలర్లకు అమ్ముడైనట్టు శాండర్స్ ప్రతినిధి పేర్కొన్నారు.













