ఆల్బనీ ఆంధ్ర వనభోజనాల మెనూ చూశారా?
ఆల్బనీ ఆంధ్ర సంఘం సభ్యులకోసం వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసింది. జూన్ 25వ తేదీన నిష్కాయునలోని నిస్కాయున కమ్యూనిటీ సెంటర్ పార్క్లో ఈ కార్యక్రమం జరగనున్నది. మెనూ లిస్ట్ నోరూరిస్తుంది. మైసూరు బోండా, మటన్ బిర్యానీ, ఆంధ్ర కోడికూర, క్యాప్సికమ్ మసాల కూర, పప్పు చారు, ఆంధ్ర ఆవకాయ, గోంగూర, పుచ్చకాయ, వెజిటబుల్ బిర్యానీ, బంగాళదుంప వేపుడు, సొరకాయ క్యారట్ హల్వా, సోం పాపిడి, ఐస్క్రీమ్ మెనూలో చోటుచేసుకున్నాయి. దీంతోపాటు వైట్ రైస్, కొబ్బరి పచ్చడి, ముద్దపప్పు, అప్పడాలు, వడియాలు, పెరుగు కూడా మెనూలో ఉన్నాయి. ఇతర వివరాలకు ఆల్బనీ ఆంధ్ర వెబ్సైట్ను చూడండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLScLvDkwSkzdm2M9coAXCZvt3oSF6cPr7rIwyHyoSY5jtCGvVA/viewform













