ఒరాక్ ఒబామా మమ్మల్ని ఆటపట్టించారు!
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ఓ మహిళను, ఆమె భర్తను సరదాగా ఆటపట్టించారు. ఈ విషయాన్ని ఆ మహిళ స్వయంగా మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి. గత వారం అలస్కాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి జోలెన్ జాకిన్స్కీ తన భర్త, ఆరు నెలల పాపతో వచ్చింది. భర్త ఎదో పనిమీద కాస్త పక్కకు వెళ్లగా, నెలల బుజ్జాయిని తల్లి జోలెన్ ఆడిస్తోంది. ఇంతో సాధారణంగా ఉన్న ఓ వ్యక్తిని ఆమె చూసి ఒబామా అనుకుని పొరపడ్డట్లుగా భావించారు. దగ్గరకెళ్లి చూసే ఆశ్చర్యం. ఆ సాధారణ వ్యక్తి మరెవరో కాదు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామానే. పాపతో పాటే ఒబామా వద్దకు నేను చేరుకోగానే ఆయన చిరునవ్వుతో పలకరించారు. ఈ అందమైన బుజ్జాయి ఎవరు అని అడిగారు. మా పాప అని చెప్పిన తర్వాత, చిన్నారి గిసెల్లేను ఒబామా ఎత్తుకుని ముద్దుచేశారు. ఆ సంతోషంలో నేను ఒబామాతో సెల్ఫీలు తీసుకున్నారు. గిసెల్లే తండ్రి అక్కడికి రాగానే మీ పాప అందంగా ఉంది. చిన్నారిని నాతోపాటు తీసుకెళ్తాను. మీకు ఏం ఇబ్బందిలేదు కదా అంటూ జోక్ చేసి ఒబామా ఆ దంపతులను సరదాగా ఆటపట్టించారు. నిజంగానే తమ పాపను అడిగారేమోనని తన భర్త భావించాడని జోలెన్ తెలిపారు. ఒబామా లాంటి గొప్పవ్యక్తిని కలుసుకుని ఆయనతో ఫొటోలు దిగడం ఇప్పటికే ఆశ్చర్యంగానే ఉందని, కొందరికి మాత్రమే ఈ చాన్స్ దొరుకుతుందని జోలెన్ జాకిన్స్కి వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటొలోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్గా మారాయి.













