ఢిల్లీ-వాషింగ్టన్ డీసీ డైరెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభం
భారత్ నుంచి అమెరికాకు మరో డైరెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి డైరెక్ట్ విమాన సర్వీసును ఎయిరిండియా ప్రారంభించింది. తొలి విమానం శుక్రవారం అక్కడి డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండయింది. దీంతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ప్రయాణం మరింత సులువైంది. ఇలా వచ్చిన తొలి విమానం ఏఐ 103కి వాటర్ క్యానన్లతో సెల్యూట్ చేశారు. అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్నా, ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లొహానీ, కమర్షియల్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాత్సవ తదితరులు కూడా ఈ విమానంలో అమెరికా వెళ్లారు. ఈ సర్వీసు కోసం ఎయిరిండియా తన బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానాన్ని కేటాయించింది. ఇందులో 238 మంది ప్రయాణికులకు అవకాశం ఉంటుంది. వీటిలో 8 ఫస్ట్‌క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్‌లు ఉంటాయి. ఈనెల 9,17 తేదీలలో 321 సీట్లుండే మరో పెద్ద విమానాన్ని నడిపిస్తున్నారు.








