మోదీ పర్యటనతో మారిన సీన్
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనతో పాక్‌పై అమెరికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. వైట్‌హౌస్ కీలక ప్రకటనే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. పాక్ భూభాగం కేంద్రంగా ఇతరదేశాలపై జరుగుతున్న ఉగ్రవాద దాడులు, చొరబాట్లను నిరోధించాలని పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. 26/11 ముంబై దాడులు, పఠాన్‌కోట్ దాడులను కారణమైన నేరస్థులను భారత్‌కు అప్పగించాలని కూడా పాక్‌ను వారు కోరినట్లు వైట్‌హౌస్ మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది.








