అమెరికా వీసాలు ఇవ్వకుండా మోకాలొడ్డినా.. ఆఫ్గన్ అమ్మాయిలకు మరో అవకాశం
తమలోని వినూత్న ప్రతిభను కనబరుస్తూ, బాల్ సార్టింగ్ రోబోటిక్ యంత్రాన్ని తయారు చేసి, అమెరికాలో జరిగే పోటీల్లో పాల్గొనాలని భావించి, వీసాల నిరాకరణకు గురైన ఆఫ్గన్ అమ్మాయిలకు అవకాశం మరో రూపంలో స్వాగతం పలికింది. వీరి విషయం తెలుసుకున్న పోటీల నిర్వాహకులు, స్కైప్ ద్వారా ఆన్లైన్ లో పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఫస్ట్ గ్లోబల్ కంపెనీ ప్రెసిడెంట్ జోయే సెస్టాక్ ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించారు. అమెరికా తీసుకున్న నిర్ణయం విచారకరమని, అయితే ఆఫ్గన్ అమ్మాయిలు స్కైప్ వీడియో లింక్‌ను వాడుకుని తమ హెరత్ పట్టణం నుంచే పోటీపడవచ్చని సృష్టం చేశారు. వీరి కథానాన్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రపంచం దృష్టికి తీసుకురాగా, పలువురు అమెరికా వైఖరిని తప్పు పట్టిన సంగతి తెలిసిందే.








