రూ.3.5 లక్షలు పలికిన అడాల్ఫ్ హిట్లర్ నిక్కర్
జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఉపయోగించిన నిక్కర్ అమెరికాలో నిర్వహించిన ఓ వేలంలో రూ.3.5 లక్షలు పలికింది. గోధుమ రంగు పలుచని వస్త్రం మీద తెల్లని చారలతో ఉన్న ఈ నిక్కర్ పొడవు 19 అంగుళాలు. దీని నడుము సైజు 39 అంగుళాలు. దీని మీద ఎహెచ్ అనే గుర్తు కూడా ఉంది. 1938లో ఆస్ట్రియాలోని పార్కోటల్ గ్రాజ్ హోటల్లో బస చేసినపుడు హిట్లర్ ఈ నిక్కర్‌ను అక్కడ వదిలివేసినట్లు వేలం నిర్వహించిన సంస్థ తెలిపింది. ఆ హోటల్ యజమానుల వంశానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర నుంచి ఈ నిక్కర్‌ను వేలం నిర్వహణ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నిక్కర్‌తో పాటు హిట్లర్ బస చేసిన హోటల్ గదిలో మరికొన్ని చిన్న చిన్న వస్తువులను కూడా వదిలేసినట్లు తెలుస్తోంది.













