న్యూజెర్సీలో నిజామాబాద్ ఎన్నారైల మృతి
న్యూజెర్సీలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బి)కి చెందిన గోపాలం రత్నజ్యోతి మరణించారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త సునీల్ సాగర్, కుమారుడ దైవిక్ సాగర్(21నెలలు)కు తీవ్ర గాయాలయ్యాయి. ధర్మారం(బి)కి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ కుమారుడు సునీల్ సాగర్ న్యూయార్క్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ట్రైజరీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.








