న్యూయార్క్ టు లండన్ ప్రయాణం ఇక 2.5 గంటలే
సుదూర ప్రాంతాల మధ్య విమాన ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన సూపర్సోనిక్ వాణిజ్య విమానాలతో ఓ అంకుర సంస్థ ముందుకు వచ్చింది. అత్యంత వేగంగా దూసుకెళ్లే ఈ విమానాలు లండన్ నుంచి న్యూయార్క్‌కు కేవలం 2.5 గంటల్లోనే చేరుకుంటాయని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమా సమయం కంటే తాము తక్కువ సమయంలోనే ప్రయాణికులను లండన్ నుంచి న్యూయార్క్ చేరవేస్తామని పేర్కొంటున్నారు. ప్రస్తుత వాణిజ్య విమానాలకంటే రెండు రెట్ల అధిక వేగంతో ఇవి దూసుకెళ్తాయిన చెప్పారు.













