సిరియాలో ట్రంప్ రెస్టారెంట్!
సిరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట రెస్టారెంట్ తెరవడం చర్చనీయంగా మారింది. సిరియాలో ఒక వర్గానికి వ్యతిరేకంగా అమెరికా క్షిపణులతో దాడులకు పాల్పడిన సంగతి విదితమే. అదీ కాకుండా ట్రంప్ నిషేధించిన ఏడు ముస్లిం దేశాల్లో సిరియా ఒకటి. ఈ నేపథ్యంలో సిరియాలోని కొబని సిరియా నగరానికి చెందిన వలీద్ షేఖి అనే వ్యక్తి తన రెస్టారెంట్‌కు ట్రంప్ పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. సిరియా, అమెరికా మధ్య శాంతి భద్రతలు మెరుగుపడాలన్న ఉద్దేశంతో తన రెస్టారెంట్‌కు అమెరికా అధ్యక్షుడి పేరు పెట్టానని వలీద్ తెలిపాడు. తమ దేశ ప్రజల కోసం అమెరికా సహకరిస్తూ ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ట్రంప్‌కు వలీద్ ధన్యవాదాలు తెలిపారు.













