గడువు తీరినా అమెరికాలో 30వేల మంది భారతీయులు
గత ఏడాది 30 వేల మందికిపైగా భారతీయులు గడువుకు మించి అమెరికాలో ఉన్నారని ఒక నివేదిక పేర్కొంది. 2016లో భారత్ నుంచి వివిధ వీసాలపై 14 లక్షల మంది అమెరికాకు వచ్చినట్లు తెలిపింది. వ్యాపార, పర్యాటక, విద్యార్థి తదితర వలసేతర వీసాలపై ఏటా అమెరికాను సందర్శిస్తుంటారు. వీరి తిరిగి ప్రయాణాలు, గడువు తీరినా ఇంకా ఇక్కడే ఉండిపోవడం వంటి అంశాలపై అంతర్గత వ్యవహారాలశాఖ, అమెరికా కాంగ్రెస్కు ఒక నివేదిక సమర్పించింది. వలసేతర సందర్శకుల్లో 96 శాతం మందికి సంబంధించిన గణాంకాలను ఇందులో పేర్కొన్నారు.








