విజయవంతమైన టిఏజిసి టెన్నిస్ పోటీలు
చికాగో మహా నగర తెలుగు సంస్థ, టిఏజిసి (TAGC) ఏటా నిర్వహించే టెన్నిస్ పోటీలు విజయవంతంగా నిర్వహించింది. డియర్ ఫీల్డ్ లో ఉన్న కాలేజీ పార్కు క్లబ్ లో ఈ పోటీలు నిరాటంకంగా సాగాయి. చికాగో పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంతో పోటీలలో పాల్గొన్నారు. టిఏజిసి (TAGC) ఈ పోటీలను 1980 నుండి నిర్వహిస్తూ వస్తుంది. ఈ పోటీల ద్వారా ఆటగాళ్లకు ఇతర ఆటగాళ్లతో పరిచయాలు ఏర్పడేందుకు తోడ్పడతాయి.
పలు విభాగాలలో పోటీలలో పాల్గొనేందుకు 123 క్రీడాకారులు పాల్గొన్నారు ఇంత మంది క్రీడాకారులు పాల్గొనడం TAGC చరిత్రలో మొట్టమొదటిసారి.కాలేజీ పార్కు క్లబ్ ప్రాంగణం లో ఉన్న తొమ్మిది టెన్నిస్ కోర్ట్ లను టిఏజిసి (TAGC) పోటీలు నిర్వహించేందుకు అద్దెకు తీసుకుంది. ఈ ఏడు టిఏజిసి (TAGC) పురుషుల డబుల్స్, యువ బాలబాలికల సింగిల్స్ (10 సంవత్సరముపైన మరియు 16 సంవత్సరముల లోపు, బాలురు సింగిల్స్ (11 సంవత్సరములలోపు విబాగాలలో పోటీలు నిర్వహించింది. యువత లో టెన్నిస్ పై ఆసక్తి రేకెత్తించేందుకు టిఏజిసి (TAGC) బాలబాలిక విభాగం లో సింగిల్స్ పోటీలు ఏర్పాటు చేసింది.
ఆటలలో గెలిచినా వారికీ టిఏజిసి (TAGC) అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే, క్రీడా విభాగ చైర్ సప్తగిరి సంగేమ్, కో చైర్ శ్రీనివాస్ కన్రు, టెన్ని కోర్ కమిటీ మెంబెర్ ప్రసాద్ మారం, స్పాన్సర్ జగదీశ్ గార్లతో కలిపి విజేతలకు బహుమతులను అందజేశారు.
బాలికల సింగిల్స్ :
మొదటి బహుమతి : పూజ, పొన్నెబోయిన
రెండవ బహుమతి : నిశాలి, ముసునూరి
బాలురు 11 సంవత్సరములలోపు
మొదటి బహుమతి : అక్షయ్, మారం
రెండవ బహుమతి : రుషీల్, సస్వడే
యువజన విభాగం :
మొదటి బహుమతి : తేజ్, ఇక్కుర్తి
రెండవ బహుమతి : ఆదిత్య, పల్లె
పురుషుల విభాగం :
మొదటి బహుమతి : శ్రీనివాస్, మెర్నీడి & సాయి, మెర్నీడి
రెండవ బహుమతి : శ్రీకాంత్, వెల్లంకి & తరుణ్, వెల్లంకి
ఈ యేటి టెన్నిస్ పోటీలు ఘనంగా నిర్వహించేందుకు ఆర్థిక సహాయం అందించిన సిగ్నస్ సోలుషన్స్ ( Cignus Solutions) అధినేత జగదీష్ గారికి మరియు మిగతా యాజమాన్యానికి , పోటీల నిర్వహణార్థం అహర్నిశలు తోడ్పడిన టెన్నిస్ కమిటీ మెంబెర్ ప్రసాద్ మారం గారికి టిఏజిసి (TAGC) అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే కృతజ్ఞతలు తెలియజేసారు. పోటీలు అద్భుతంగా నిర్వచినందుకు గాను క్రీడా విభాగ చైర్ సప్తగిరి సంగేమ్ , కో చైర్ శ్రీనివాస్ కన్రు, కోశదీకరి వెంకట్ గూనుగంటి , రాము బిల్లకంటి , సాయి గొంగటి, జ్యోతి చింతలపని, ప్రవీణ్ వేములపల్లి, మిగతా కార్యవర్గ సభ్యులను, వాలంటీర్లను అభినందించారు మరియు పోటీలలో పాల్గొన్నందుకు గాను ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసారు.













