వైద్యశాస్త్రంలో ముగ్గురు అమెరికన్లకు నోబెల్
వైద్యశాస్త్రంలో విశేష సేవలు అందించిన ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలను 2017 నోబెల్ బహుమతి వరించింది. జెఫ్రీ హాల్, మైకేల్ రోస్ బాష్, మైకేల్ యంగ్లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి అందజేయనున్నారు. మానవ జీవ గడియారంలోపై చేసిన పరిశోధనలకు గానూ వీరికి నోబెల్ బహమతి ఇస్తున్నట్లు స్టాక్ హోమ్ లోని నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రకటించింది. మొక్కలు, జంతువులు, మనిషి భూమిపైన వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎలా మారతాయనే అంశాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైద్యశాస్త్రంలో విశేష సేవలందించిన వీరికి భారత కరెన్సీప్రకారం 71 కోట్ల 96లక్షల 7వేల 500 రూపాయలు బహుమతిగా అందజేస్తారు.








