ట్రంప్‌పై విమర్శల వెల్లువ
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన డీఏసీఏ (బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా) కార్యక్రమాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అనేకమంది ‘డ్రీమర్లు’ తమను దేశం నుంచి పంపించేస్తారని ఆందోళన చెందుతున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులతోబాటు అమెరికా వచ్చి, అక్కడ నివసించడానికి చట్టపరంగా ఏ అనుమతులూ లేకుండా అక్రమంగా ఉంటున్న వారిని డ్రీమర్లు అని పిలుస్తారు. అమెరికాలో ఉంటున్న భారత్‌కు చెందిన డ్రీమర్లు సంఖ్య 20 వేలకుపైగానే ఉంటుందని తాజా సమాచారం..








