డల్లాస్లో గురు పరమహంస యోగానంద 125 జయంతి వేడుకలు
గురు పరమహంస యోగానంద 125 జయంతి కార్యక్రమాన్ని డల్లాస్ క్రియా యోగ వారు సెప్టెంబరు 27, 2017 న లూయిస్ విల్ లోని ఎంసిఎల్ గ్రాండ్ థియేటర్ లో ఘనంగా జరిపారు. 1920లో అమెరికా వచ్చిన యోగానంద క్రియా యోగా గురించి పాశ్చాత్యులకు వివరించారు. మానవజీవితంలో యోగా వల్ల కలిగే మంచి మార్పులను అందించి మతాలకు అతీతంగా అందరి మన్ననలు పొందారు.
ఈ కార్యక్రమంలో ప్రస్తుత గురు పరమహంస ప్రజ్ఞానంద ప్రసంగిస్తూ ఇతరుల పట్ల ప్రేమ భావాన్ని కలిగిఉండాలని బోధించారు. స్థానిక నృత్య, సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ అలరించారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) డల్లాస్ చాప్టర్ తమ చేయూతనందించింది.
ఈ కార్యక్రమంలో నాట్స్ సంస్థ తరపున కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కోనేరు, ఉమ్మడి కోశాధికారి శేఖర్ అన్నే, ప్రచారం & మార్కెటింగ్ సమన్వయకర్త శ్రీనివాస్ కొమ్మినేని, డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ రామకృష్ణ మర్నేని, అమర్ అన్నే మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.