ఫోర్బ్స్ జాబితాలో భారత సంతతి ఇన్వెస్టర్లు
ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన 100 మంది అత్యుత్తమ వెంచర్ క్యాపిటలిస్టుల వార్షిక జాబితాలో భారత సంతతికి చెందిన పదకొండు మంది ఇన్వెస్టర్లకు స్థానం లభించింది. మిడాస్ 2017 పేరుతో విడుదల చేసిన జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 100 మంది వెంచర్ క్యాపిటలిస్టులు స్థానంలో పొందారు. ఈ జాబితాలో సికోయా క్యాపిటల్‌లో పార్ట్నర్గా ఉన్న జిమ్ గోయెట్జ్ మొదటి స్థానంలో నిలిచారు. వరుసగా మూడేళ్లపాటు ఈయనే మొదటి స్థానం కొనసాగుతుండటం విశేషం. 2,200 కోట్ల డాలర్లకు వాట్సప్‌ను ఫేస్‌బుక్‌కు విక్రయించినప్పటి నుంచి ఈయన హవా సాగుతోంది. ఫేస్బుక్ షేర్లలో మూడు విడదలుగా 6 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టి దాన్ని 300 కోట్ల డాలర్లకు పెంచుకున్నారు.
ఇక భారత సంతతికి చెందిన వారిలో నీరజ్ అగర్వాల్ 11వ స్థానంలో నిలిచారు. ఈయన బ్యాటరీ వెంచర్స్‌లో జనరల్ పార్ట్నర్గా ఉన్నారు. ఈయన తర్వాత సమీర్ గాంధీ (యాక్సెల్ పార్ట్నర్స్లో పార్ట్నర్) 28వ స్థానంలో, సలీల్ దేశ్‌పాండే (బెయిన్ క్యాపిటల్ వెంచర్స్) 33వ స్థానంలో, అనీల్ భుశ్రీ (వర్క్డేస్ సిఇఒ, సహవ్యవస్థాపకుడు) 37వ స్థానంలో, గౌరవ్ గార్గ్ (వింగ్ వెంచర్ క్యాపిటల్ నార్త్‌వెస్ట్ పార్ట్) 48వ స్థానంలో, ప్రమోద్ హాక్యూ (నార్త్‌వెస్ట్ వెంచర్ పార్ట్నర్స్ సీనియర్ మేనేజింగ్ పార్ట్నర్) 76వ స్థానంలో, హేమంత్ తనేజా (కాటలిస్ట్ పార్ట్నర్స్ ఎండి) 70వ స్థానంలో, నవీన్ చద్ధా (మేఫీల్డ్ ఫండ్ ఎండి) 73వ స్థానంలో, రవి మాత్రే (లైట్ స్పీడ్ వెంచర్ పార్ట్నర్) 76వ స్థానంలో, దేవన్ పరేఖ్ (ఇన్ సైట్ వెంచర్ పార్ట్నర్స్ ) 99వ స్థానంలో నిలిచారు.








