10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు -రెండవ సమగ్ర ప్రకటన-సాదర ఆహ్వానం
వచ్చే నెల..అనగా సెప్టెంబర్ 23 -24, 2017 తారీకులలో అమెరికా రాజధాని వాషింగ్టన్ DC ప్రాంతంలో 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కి మిమ్మల్ని సకుటుంబ, సపరివార సమేతంగా మరొక సారి సారి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సాహితీ సదస్సు సమగ్ర వివరాలు ఇందుతో పొందు పరిచాం. ఇప్పటికే ముఖ్యమైన ఏర్పాట్లూ అన్నీ పూర్తి అయ్యాయి. పై నగరాల నుంచి వచ్చే వారికి అతి తక్కువ ఖరీదులో వసతి ఏర్పాటు చేశాం. స్థానిక DULLES airport నుంచి హోటల్ కి, అక్కడ నుంచి సభాస్థలికి ఉచితంగా shuttle సర్వీసు ఉంటుంది.
సదస్సు ప్రవేశ రుసుము ఒక్కొక్క వ్యక్తికీ కేవలం $50 మాత్రమే. ప్రతినిధులు అందరికీ రెండు రోజులు ఉదయం & మధ్యాహ్నం కాఫీ, ఫలహారాలు, మధ్యాహ్నం విందు భోజనం, ఈ సదస్సు సందర్భంగా ముద్రించబడి సదస్సులో విడుదల అయ్యే కనీసం మూడు పుస్తకాలు (అమెరికా తెలుగు కథానిక -13వ సంకలనం తో సహా, సుధేష్ణ సోమ గారి నవల ‘నర్తకి’ తో సహా..)…రెండు రోజుల పాటు హాయిగా, సరదాగా వినోద భరితంగా, విజ్ఞానదాయకంగా, ఆసక్తి కరంగా ఉన్నత స్థాయి సాహిత్యం విందు….అన్నీ అంత తక్కువ ఖర్చులోనే… వెలకట్ట లేని జీవితానుభవం….
అంతే కాదు..భారత దేశం నుంచి తనికెళ్ళ భరణి, కవి జొన్నవిత్తుల, అచ్చ తెనుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఖదీర్ బాబు, ద్వానా శాస్త్రి, దాసరి అమరేంద్ర, కన్నెగంటి అనసూయ …మొదలైన లభ్దప్రతిష్టులైన రచయితలు ఈ సదస్సులో ఆత్మీయ అతిధులుగా పాల్గొనడానికి తమ ఆమోదం తెలిపారు..
ఇక ఉత్తర అమెరికా నుంచి సుమారు 15 మంది పేరుగాంచిన సాహితీవేత్తలు ఆహ్వానిత వక్తలు గా విచేస్తున్నారు. ఆయా వివరాలు ఇందుతో జత పరిచిన పూర్తి ప్రకటన చూడండి…
ప్రతిష్టాత్మకమైన ఈ 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం తమ విరాళాలతో ఆర్థిక పరంగా సమర్ధించమని తెలుగు భాషాసాహిత్యాభిమానులందరినీ అర్థిస్తున్నాం. వివరాలకి ఇందుతో జత పరిచిన “దాతలకు ప్రత్యేక విన్నపం” చూడండి. ఇందుతో జత పరిచిన “Registration & Donation” పత్రంలో ప్రతినిధులుగా నమోదు చేసుకోడానికీ, తగిన విరాళం పంపించడానికీ కావలసిన వివరాలు ఉంటాయి. లేదా దయచేసి ఈ క్రింది లంకె మీద నొక్కి ఏ క్రెడిట్ కార్డ్ అయినా వాడి మీ విరాళం పంపించి సహాయం చెయ్యండి. Registration Fees & Donation are tax-deductible in USA.
https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=3R29K3F2QREMQ
వాషింగ్టన్ DC ప్రాంతంలో మొట్టమొదటి సారి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకి మీకు మరొక్క సారి సాదరంగా ఆహ్వానం పలుకుతూ….
సంచాలకులు :
వంగూరి చిట్టెన్ రాజు & భాస్కర్ బొమ్మారెడ్డి
సదస్సు నిర్వాహక సంస్థలు:
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & రాజధాని ప్రాంత తెలుగు సంఘము
సదస్సు కార్యనిర్వహాక వర్గ సభ్యులు:
Sai Rachakonda (Houston), Nallu Chittarajan, Badrinath Challa, Ravi Bojja, Satyajit Mareddy,
Sudarshana Devireddy, Gopal Nunna, Srinivas Vootla, Anil Nandikonda, Vijaya Dondeti, Rajya Lakshmi, Durgaprasad Gangisetti, Satish Vaddi, Ramachandra Yerubandi
మరియు
గౌరవ సలహా దారులు: సుధేష్ణ సోమ, జక్కంపూడి సుబ్బారాయుడు, వంశీ రామరాజు (హైదరాబాద్)
Conact: Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
మరొక చిన్న విన్నపం:
ఈ 10వ సదస్సు అమెరికాలో జరుగుతున్నా, ఇండియాలో కొన్ని అవసరమైన ఖర్చులు అవుతున్నాయి. అంచేత ఆసక్తి ఉన్న వారు మీ విరాళం రూపాయల రూపేణా ఇండియాలో పంపించవచ్చును. Our account details are:
Account name: Vanguri Foundation of America
A/c Number: 013210011015533
Bank Name: Andhra Bank, Bagh Amberpet Branch, Hyderabad, TN
IFSC code: ANDB0000132













