తానా సంగీత తరగతుల విద్యార్థులకు పట్టా ప్రదానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం (ఎస్పీఎంవీవీ) ఆధ్వర్యంలో అమెరికాలోని క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కోర్సులలో చేరిన వందమంది ఎన్నారై విద్యార్థులకు మ్యూజిక్ కోర్సు సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ వి.దుర్గా భవానితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని టెక్సాస్ లోని ప్లానోలో ఉన్న మినర్వా హోటల్లో తానా సభ్యులు నిర్వహించారు. సుస్వర మ్యూజిక్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఆలపించిన మధురమైన గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. తానా, ఎస్పీఎంవీవీ సహాకారంతో అందిస్తున్న కల్చరల్ డ్యాన్స్, మ్యూజిక్ కోర్సులను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను కూడా డా. ప్రసాద్ తోటకూర వివరించారు.
ఈ సందర్బంగా మ్యూజిక్ కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన 100 మం ది విద్యార్థులకు ప్రొఫెసర్ భవాని సర్టిఫికేట్స్ను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లీతండ్రులను ఉద్దేశించిన భవాని మాట్లాడారు. విజయవంతంగా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సుగన్ చాగర్లమూడి, తానా కల్చరల్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ , తానా ఎస్పీఎంవీవీ డ్యాన్స్ కోర్సుల నేషనల్ కో ఆర్డినేటర్ డా.రాజేశ్ ఆడుసుమిల్లి, తానా ఎస్పీఎంవీవీ మ్యూజిక్ కోర్సుల నేషనల్ కోఆర్డినేటర్ అనిపింది మీనాక్షి, తానా బోర్డ్ చైర్పర్సన్ చలకొండ్రకుంట, ప్రముక డ్యాన్స్ గురు కళారత్న సత్యనారాయణలు పాల్గొన్నారు.








