యశ నాగులతో నెక్స్ట్ లెవల్‌కు ది ప్యారడైజ్ బజ్
నేచురల్ స్టార్ నాని(nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(the paradise)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) మ్యూజిక్ మరింత ఊపు తీసుకొస్తోంది. ఇప్పటికే ఆయా షేర్(aaya sher) తో గ్లోబల్ వైబ్స్ క్రియేట్ చేసిన అనిరుధ్.. తాజాగా రిలీజైన యశ నాగుల(Yeshnagula) సాంగ్‌తో మరోసారి తన మార్క్ చూపించాడు. రిలీజైన కొద్దిసేపటికే ఈ సాంగ్ అన్ని ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. యూట్యూబ్‌లో 20 మిలియన్లకు పైగా వ్యూస్, 3.8 లక్షలకు పైగా లైక్స్‌ను 20 గంటల్లోనే సాధించడం పాటకు దక్కిన రెస్పాన్స్‌కు నిదర్శనంగా నిలిచింది.
యశ నాగుల సాంగ్ లో నాని, కీర్తి సురేష్(Keerthy suresh) కెమిస్ట్రీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. జడల్ పాత్రలో నాని చూపించిన ఎనర్జీ, డ్యాన్స్ మూవ్స్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనిరుధ్ అందించిన హై ఎనర్జీ బీట్స్‌కు ఆయన చేసిన మ్యూజిక్ మిక్సింగ్ అదనపు బలంగా మారింది. ఆట సందీప్(Aata sandeep) కొరియోగ్రఫీ సాంగ్‌కు మరింత స్టైలిష్ టచ్ ఇచ్చింది. దీంతో ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు సాంగ్‌లో కనిపించిన విజువల్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పాటను తెరకెక్కించిన విధానం ది ప్యారడైజ్ ను రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైనర్ కంటే భారీ స్థాయిలో చూపించబోతున్నాడనే సంకేతాలు ఇస్తోంది. సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యంత భారీ సినిమాగా రూపొందుతోంది. సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ థియేటర్లలోకి రానుంది.








