ఆదర్శ కుటుంబం.. కంటెంట్‌దే కీ రోల్!
టాలీవుడ్లో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విక్టరీ వెంకటేష్(venkatesh) నటించిన ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) ఒకటి. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోయిన్ గా నటించారు. పలు పోస్ట్పోన్ల తర్వా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. రిలీజ్ కు ముందు నెలకొన్న పరిస్థితులు, సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ మూవీ బాక్సాఫీస్ ప్రయాణం ఎలా సాగుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కథాంశం, త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలుస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌కు ఉండాల్సిన స్థాయిలో హైప్ ఇంకా కనిపించడం లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ప్రమోషన్ల ద్వారా ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచాల్సిన అవసరం చిత్రబృందంపై ఉంది.
మరోవైపు, కొంతకాలంగా థియేటర్లలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కు ఈ సినిమా మంచి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. అయితే కేవలం స్టార్ కాంబినేషన్, ప్రచారంతోనే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడం సాధ్యం కాదు. కథ, కథనం, ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకుంటాయన్నదే కీలకం. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే అవకాశముంది. మొత్తంగా ఆదర్శ కుటుంబం సక్సెస్ ను డిసైడ్ చేసేది ప్రమోషన్స్ కంటే కంటెంట్ అనే చెప్పాలి.








