Rukmini Vasanth: కన్నడ భామకు షాకిచ్చిన తెలుగు సినిమా
కన్నడ భామలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన అనుష్క(Anushka), ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు సృష్టిస్తున్న రష్మిక మందన్నా(Rashmika Mandanna) కన్నడ నుంచి టాలీవుడ్ కు వచ్చి ఇక్కడ స్టార్ స్టేటస్ అందుకున్న వాళ్లే. కన్నడలో సప్త సాగరాలు దాటి(Sapta sagaralu daati) సినిమాలో తన నటనతో అందరి మనసుల్ని దోచేసింది రుక్మిణి వసంత్(Rukmini Vasanth).
తెలుగులో ఆ సినిమాను రుక్మిణి కోసమే చూశారంటే ఆశ్చర్యం లేదు. అలాంటి రుక్మిణికి తెలుగులో ఎంట్రీ గ్రాండ్ గా దక్కుతుందనుకుంటే సైలెంట్ గా వచ్చిన నిఖిల్(Nikhil) సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo) సినిమాతో జరిగింది. ఆ సినిమా అసలు ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు. నిఖిల్, సుధీర్ వర్మ(Sudheer Varma) కలయికలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న అభిమానంతో రుక్మిణి ఆ సినిమా చేస్తే సినిమా రిజల్ట్ అమ్మడికి పెద్ద షాకే ఇచ్చింది. అయితే రుక్మిణి లాంటి హీరోయిన్ తో తెలుగులో ఎవరొకరు లవ్ స్టోరీలు చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు. ప్రశాంత్ నీల్(Prasanth Neel)- ఎన్టీఆర్(NTR) కాంబోలో రానున్న సినిమాలో రుక్మిణి ఛాన్స్ కొట్టేసిందంటున్నారు. కానీ ఇంకా దానిపై అధికారిక ప్రకటన రాలేదు. తమిళంలో మాత్రం శివ కార్తికేయన్(Siva Karthikeyan) తో నటిస్తుంది.













