24 గంటలు షూటింగ్.. రామ్ పోతినేని రిస్క్ మామూలుగా లేదుగా!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni) మొదటిసారి డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన రాపో23(RAPO23)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హీరోగా ప్రధాన పాత్రలో కనిపించడంతో పాటు డైరెక్షన్ బాధ్యతలను కూడా ఏకకాలంలో నిర్వహిస్తున్న ఆయన సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పుదుచ్చేరి శివార్లలో జరిగిన కీలక షెడ్యూల్లో రామ్ ఏకంగా 24 గంటల పాటు షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. భారీ స్థాయిలో రూపొందించిన ప్రత్యేక సెట్స్‌లో ఈ షెడ్యూల్ దాదాపు తొమ్మిది రోజుల పాటు కొనసాగినట్లు తెలుస్తోంది.
హీరోగా కెమెరా ముందుకు వెళ్లడంతో పాటు డైరెక్టర్ గా ప్రతి సీన్ ను పర్యవేక్షించాల్సి రావడంతో రామ్‌కు ఈ షెడ్యూల్ మరింత సవాల్‌గా మారిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సినిమా స్కేల్‌కు తగ్గట్టుగా భారీ సెటప్‌ను సిద్ధం చేయడంతో షూటింగ్‌పై యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. రెండు కీలక బాధ్యతలను ఒకేసారి మోస్తున్నప్పటికీ రామ్ ఏమాత్రం తగ్గకుండా పనిచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ram pothineni,
అయితే అనూహ్యంగా కురిసిన వర్షాలు షూటింగ్‌కు అంతరాయం కలిగించడంతో పుదుచ్చేరి షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపివేసి యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న సీన్స్ ను పూర్తి చేసేందుకు త్వరలోనే తిరిగి పుదుచ్చేరి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో రాపో23 రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా మారుతున్నట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.








