రవితేజ, వివేక్ ఆత్రేయ, లక్ష్మణ్, శ్రీని, బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ క్రేజీ కాంబినేషన్లో కొత్త సినిమా
‘ఇరుముడి’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘సరిపోదా శనివారం’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ట్యాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ వివేక్ ఆత్రేయతో రవితేజ జతకట్టనున్నారు.
‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ, రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక వేడుకలో దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని.. రవితేజను కలిసి బ్లాక్‌బస్టర్ విజయానికి అభినందనలు తెలిపారు.
రవితేజ, వివేక్ ఆత్రేయ, లక్ష్మణ్, శ్రీని, బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రం ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రవితేజ, వివేక్ ఆత్రేయ కలయికలో రాబోతున్న ఈ సినిమా ప్రత్యేకమైన కాంబినేషన్‌గా నిలవనుంది. వివేక్ ఆత్రేయ తనదైన ట్రీట్మెంట్తో రూపొందించే ప్రపంచంలోకి రవితేజ అడుగుపెట్టడం ద్వారా సరికొత్త సినీ అనుభూతి అందించనున్నారు. రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, లార్జర్-దేన్-లైఫ్ పర్సనాలిటీకి వివేక్ ఆత్రేయ స్టైల్ ప్రత్యేకంగా నిలవనుంది.
దర్శకుడు హసిత్ గోలితో రవితేజ చేయనున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.








