రవితేజ లైనప్‌లో రెండు విభిన్న చిత్రాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
మాస్ మహారాజా రవితేజ(raviteja) వరుస సినిమాలతో బిజీగా మారుతున్నారు. ఇరుముడి(irumudi) సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న ఆయన ప్రస్తుతం కొంత విరామం తీసుకుంటున్నప్పటికీ, నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం క్లియర్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ.. అందులో ఒకదాన్ని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(vivek athreya)తో చేయనున్నారు. సరిపోదా శనివారం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న వివేక్ ఆత్రేయ రెడీ చేసిన కథ రవితేజకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా రవితేజ కెరీర్లోనే కొత్త జానర్‌ను పరిచయం చేయనుంది.
ఈ సినిమాను దిల్ రాజు(dil raju) మాజీ భాగస్వామి లక్ష్మణ్(Laxman) నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికను చిత్రబృందం పూర్తి చేసే పనిలో ఉంది. కథకు తగ్గట్టుగా కొత్త తరహా ట్రీట్మెంట్తో సినిమాను రూపొందించేందుకు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.
మరోవైపు రవితేజ మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు కూడా ఓకే చెప్పారు. హసిత్ గోలి(Hasith Goli) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో శ్రీ విష్ణు(Sree Vishnu) మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి 2027 రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా ద్వారా రవితేజ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఒకవైపు హారర్ కామెడీ, మరోవైపు కామెడీ ఎంటర్టైనర్తో రవితేజ లైనప్ విభిన్నంగా మారుతోంది.








