చరణ్-సుకుమార్ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్
రామ్‌చరణ్(ram charan)- సుకుమార్(Sukumar) కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక సినిమాపై మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా స్క్రిప్ట్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇటీవల సుకుమార్ పూర్తి కథను రామ్‌చరణ్‌కు ఫైనల్ నెరేషన్ ఇవ్వగా, కథపై చరణ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతుండగా, అక్టోబర్‌లో ఈ సినిమాను అఫీషియల్ గా స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో ఈ కాంబినేషన్‌పై ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ దశకు చేరుకుందనే ప్రచారం మరింత ఆసక్తిని పెంచుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఫుల్ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దేందుకు డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు అలవాటైన విధంగానే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్. కథలో ఎలాంటి రాజీ పడకుండా, ఎమోషన్స్ మరియు క్యారెక్టర్స్ జర్నీ ఆడియన్స్ ను బలంగా కట్టిపడేసేలా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా రంగస్థలం(rangasthalam)లో రామ్‌చరణ్‌కు వచ్చిన గుర్తింపును మించిపోయే పాత్రను ఈ సినిమాలో అందించాలన్నదే సుకుమార్ టార్గెట్ అని సమాచారం. రీసెంట్ గా వచ్చిన పెద్ది(Peddi) సినిమాలో కంటే మరింత ఉన్నత స్థాయి పర్ఫార్మెన్స్ను చరణ్ నుంచి రాబట్టేందుకు సుక్కు స్పెషల్ గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ రీయూనియన్పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.








