Kalki2: కల్కి2 రిలీజ్ డేట్ పై ప్రియాంక ఏమంటున్నారంటే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్(nag ashwin) తెరకెక్కించిన కల్కి 2898ఏడి(Kalki 2898AD) బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ తో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి సీక్వెల్‌పై నిలిచింది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ టైమ్ లోనే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసినట్లు నిర్మాతలు వెల్లడించగా, ఇప్పుడు కల్కి2(kalki2) షూటింగ్ వేగం అందుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ తాజా షెడ్యూల్లో కొద్ది రోజుల తర్వాత ప్రభాస్ సెట్లో జాయిన్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. భైరవ పాత్రతో పాటు మహాభారతంలోని కర్ణుడిగా కూడా ఆయన కనిపించనున్న నేపథ్యంలో ఈ పాత్రలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే విశ్వనటుడు కమల్ హాసన్(kamal hassan), సుప్రీం యాస్కిన్ పాత్రను మరింత విస్తరించి చూపించనున్నట్లు సమాచారం. తొలి భాగంలో సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొణె (Deepika Padukone) పాత్రలో ఎవరు నటిస్తారనేది అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే, గద్దర్ అవార్డుల కార్యక్రమంలో నిర్మాత ప్రియాంక దత్(priyanka dutt), కల్కి2(Kalki2) గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కల్కి2 రిలీజ్ డేట్ పై ప్రశ్నించగా, అది తప్ప ఇంకేమైనా అడిగితే బావుంటుందేమో అని ఆమె చమత్కారంగా స్పందించడం అందరినీ ఆకట్టుకుంది. వెంటనే యాంకర్ సుమ కనకాల(suma kanakala), ఈ విషయంలో నాగ్ అశ్విన్(nag ashwin) కూడా మీలానే గ్రహాలన్నీ ఓ చోట చేరినప్పుడని చెప్తుంటారని జోక్ పేల్చడంతో కార్యక్రమం హాస్యభరితంగా మారింది. భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్(vyjanthi movies) నిర్మిస్తున్న కల్కి2 2027లో విడుదలయ్యే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








