వరుస ఫ్లాపులున్నా కుంభ వేగం తగ్గట్లేదుగా!
మలయాళ సినీ ఇండస్ట్రీలో మమ్ముట్టి(mammootty), మోహన్‌లాల్(mohanlal) వంటి సీనియర్ స్టార్లతో పాటు ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran). హీరోగా నటించడంతో పాటు డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం ఆయన కెరీర్ స్పెషాలిటీ. అయితే ఈ స్పీడ్‌కు తగ్గట్టుగా ఇటీవలి సినిమాల ఫలితాలు మాత్రం కనిపించడం లేదనే డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా దాయ్ రా(Daay ra), ఖలీఫా(Khaleefa), ఐ నోబడీ(I Nobody), పల్లిచట్టంబి(palli chattambi) లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి.
పృథ్వీరాజ్ కెరీర్లో గురువాయిర్ అంబలనాదయిల్(guruvayir ambalanadayil) మాత్రమే ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. విలయత్ బుద్ధా(vilayath buddha)తో పాటు ఎల్2 ఎంపురన్(L2 Empuraan) డబ్బింగ్ వెర్షన్లకు కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ది గోట్ లైఫ్(the goat life) కోసం భారీ స్థాయిలో కష్టపడినా, అది ఆశించిన కమర్షియల్ గా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇక బాలీవుడ్లో సర్జమీన్(sarzameen), బడే మియా చోటే మియా(bade miyaan chote miyaan) వంటి ప్రయత్నాలు కూడా పృథ్వీరాజ్ మార్కెట్‌ను బలపరచలేకపోయాయి. దీంతో వరుస ఫ్లాపుల మధ్య కూడా ఆయనకు వస్తున్న భారీ అవకాశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుతం పృథ్వీరాజ్ చేతిలో తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులున్నాయి. రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(mahesh babi) హీరోగా తెరకెక్కుతున్న వారణాసి(varanasi)లో కుంభ(kumbha) అనే విలన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. మరోవైపు నాని(nani) ది ప్యారడైజ్(the paradise) లోనూ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజమౌళి సినిమాపై భారీ అంచనాలుండటంతో పృథ్వీరాజ్ కెరీర్లో ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందనే ఆసక్తి నెలకొంది. వరుస ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఆయనకు వారణాసి ఎంతవరకు కొత్త ఊపునిస్తుందనేది చూడాలి.








