పేరేంట్స్ ఎంకరేజ్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలం – డైరెక్టర్ నందిని రెడ్డి!
వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల నిర్మించిన లేటెస్ట్ మూవీ ఇంప్యూర్. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి కృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. ఈ ఈవెంట్లో ట్రైలర్‌తో పాటు పాటను కూడా లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌గా స్పెషల్ గెస్ట్‌గా డైరెక్టర్ నందిని రెడ్డి వచ్చారు.
ఈ ఈవెంట్లో నందిని రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్‌కి రావడానికి రెండే మేయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి మా బాస్ కృష్ణవంశీ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆయన చెప్తే కాదనడానికి లేదు. సెకండ్ డైరెక్టర్ నిశాంతి గురించి. నిశాంతి నాకు 15 ఏళ్లుగా తెలుసు. నాకు మంచి ఫ్రెండ్. రీసెంట్గా మా ఇంటి బంగారంలో కలిసి చేశాము. నిశాంతికి క్యారెక్టర్ ఇంకా ఉంది. కానీ ఎడిటింగ్‌లో కట్ అయింది. సారి నిశాంతి మనం త్వరలోనే కలిసి పని చేద్దాం. ప్రతీ తెలుగు వాళ్లకు ఒక సినిమా చేయాలని డ్రీమ్ ఉంటుంది. అందుకే ప్రపంచంలో తెలుగు ఆడియెన్స్ చాలా గొప్పవాళ్లు. పృథ్వీ సార్‌ను అందరూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. కానీ ఎవర్ గ్రీన్ పృథ్వీ. ఎందుకంటే.. తెలుగు కానీ, తమిళం కానీ.. ఏ లాంగ్వేజ్‌లో అయినా మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. ఆయన ముందే మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాము. ఇక శ్రీదేవి గారూ మీ అమ్మాయి డ్రీమ్ నెరవేర్చినందుకు నిజంగా మిమ్మల్ని అప్రిసియేట్ చేయాలి. పేరేంట్స్ ఎంకరేజ్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలం. ఈ సినిమా మంచి హిట్టవ్వాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను. అని అన్నారు.
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు నమస్కారం. చదివింది ఆంధ్ర యూనివర్సిటీ MA ఎకనామిక్స్ అయినా మాది తాడిపల్లి గూడెం ఇంగ్లీష్. అంటే.. ప్యూర్‌గా ఇంగ్లీష్ ఉండదు. వాళ్లు ఇంగ్లీష్‌లో చెప్తున్నప్పుడు కూడా నాకు ఏం తెలియకున్నా అన్ని అర్థమైనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంటా. డైరెక్టర్ నిశాంతి చేసిన కృషి, టాలెంట్‌ను వాళ్ల మదర్ ఎంకరేజ్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఇంప్యూర్ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. బాగా డబ్బులు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మా నందిని రెడ్డి గారూ చాలా హార్డ్ వర్కర్. అలా మొదలైంది నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు అని అన్నాడు.
డైరెక్టర్ నిశాంతి గారూ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక మనిషి ప్యూర్‌గా ఉండాలా? ఇంప్యూర్గా ఉండాలా? అనేది సొసైటి డిసైడ్ చేస్తుంది. వారాహి వచ్చి కథ నాకు చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయ్యాయి. ఒక పెళ్లి క్యాన్సల్ అవడం వల్ల ముగ్గురి పరిస్థితి ఎలా మారింది అనేది ఈ సినిమా కథ. సంధ్య, ప్రణవ్, ధీర ముగ్గురు చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన నందిని రెడ్డిగా చాలా థ్యాంక్యూ. ఇంప్యూర్ సినిమా అందరకీ నచ్చుతుంది.
ఇవి కూడా చదవండి
హీరో సాయికృష్ణ మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికి చాలా ధన్యావాదాలు. ఇక్కడ స్టేజ్ మీద ఉండానికి నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం చాలా ఉంది. ముందుగా మా ప్రొడ్యూసర్ శ్రీదేవి గారికి చాలా థ్యాంక్స్. ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటీ అవుట్ పుట్ కోసం బాగా ఖర్చుపెట్టింది. డైరెక్టర్ నిశాంతి గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇంత మంచి సినిమాలో లీడ్ రోల్ అవకాశం ఇచ్చింది. అలానే నాతో పాటు నటించిన యష్న, శ్రీవాణి గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పారు.
హీరోయిన్ యష్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను సంధ్య పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ సినిమాలో చాలా స్పెషల్‌గా ఉంటుంది. డైరెక్టర్ నిశాంతి గారికి చాలా ధన్యవాదాలు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిందనికి థాంక్యూ. కో యాక్టర్‌గా నటించిన సాయి కృష్ణకు కూడా చాలా థాంక్యూ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారికి, రామ్కీ గారికి ధన్యవాదాలు. అని అన్నారు.
ప్రోడ్యూసర్ రామ్కీ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. భగవంతుడు కొందరిని కొన్ని చోట్ల కలుపుతారు. ఒక కడుపున పుట్టకపోయిన సొంత అక్కలాగా ఇద్దరం ఉంటాము. నాకు ఫస్ట్ సినిమాకే నంది అవార్డు వచ్చింది. నేను ఇప్పుడు మూడో సినిమా చేశాను. దీనికి మా అక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేసింది. అప్పటికే ఇంప్యూర్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా చేస్తూ.. ఒక మంచి సినిమాను అందించి నందిని రెడ్డి గారూ ప్రతీ మహిళ మనసులో ఒక బంగారంలాంటి డైరెక్టర్‌గా తయారైపోయారు. ఎంతో గట్స్ ఉండాలి అలాంటి సినిమా చేయడానికి… ప్రతీ ఇంట్లో లేడీస్ జెంట్స్‌ను, ఫ్యామిలీని తీసుకెళ్లే సినిమా చేశారు. అదే విధంగా ఇంప్యూర్ సినిమా కూడా హిట్ అవ్వాలని డైరెక్టర్‌కు కంగ్రాట్స్ చెప్తున్నాను అని అన్నారు.








