Peddi: పోస్ట్ ప్రొడక్షన్ లో పెద్ది..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది(peddi)పై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి బజ్ నెలకొంది. బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో పవర్ఫుల్ కథతో ఈ సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉండగా, ప్రతి అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఇదిలా ఉండగా, తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఎడిటింగ్ రూమ్‌లో కూర్చొని పనులు కొనసాగిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న డెస్క్‌టాప్ స్క్రీన్‌పై రామ్ చరణ్ ఇంటెన్స్ లుక్ కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఆ పవర్ఫుల్ లుక్‌ను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో భారీగా స్పందిస్తూ, పెద్ది సినిమాలో చరణ్ మరో మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తుండడం సినిమాపై మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) బ్యానర్‌పై ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నట్లు మేకర్స్ తెలిపారు. అన్నీ అనుకున్న విధంగా పూర్తయితే, ఈ సినిమాను ప్లాన్ చేసిన సమయానికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళికలు వేస్తోంది. దీంతో పెద్దిపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.








