నయనతార తప్పుకోవడానికి కారణమదేనా?
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన కెరీర్లో మరో మాస్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం NBK111 పేరుతో తెరకెక్కుతున్న ఈ అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. గతేడాదే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల 2026కి వాయిదా పడింది. ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, ఫ్యాన్స్‌కు పూర్తి స్థాయి మాస్ ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శక బృందం కథను డిజైన్ చేసినట్లు సమాచారం. ప్రొడక్షన్ హౌస్ వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ సినిమాకు తొలుత హీరోయిన్గా నయనతార(Nayanthara)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో చిత్రబృందం ప్రత్యామ్నాయం కోసం వెతికింది. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్(Kajal Agerwal)ను సంప్రదించగా, ఆమె వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నయనతారతో పోలిస్తే తక్కువ రెమ్యూనరేషన్‌తో కాజల్ ఒప్పుకోవడం కూడా నిర్మాతలకు ప్లస్‌గా మారింది. ఇప్పటికే కాజల్‌పై ఫోటోషూట్ నిర్వహించి ఆమెను అధికారికంగా ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇక ఈ సినిమాకు సంగీతాన్ని ఎస్. తమన్(S. Thaman) అందిస్తున్నారు. బాలకృష్ణ- తమన్ కాంబినేషన్ గతంలో మంచి విజయాలు అందుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva)తో కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌కు వరుసగా భారీ అప్డేట్స్ రాబోతున్నాయి.








