ప్రముఖ నటుడు గిరిబాబు గారి మృతిపట్ల సంతాపం తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ
ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ను షేర్ చేశారు.
”ప్రముఖ నటులు గిరిబాబు గారు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.
విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం.
ఇవి కూడా చదవండి
ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. -చిరంజీవి
సీనియర్ నటులు, దర్శక నిర్మాత గిరిబాబు మరణవార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. నా కెరీర్ ప్రారంభంలోనే ‘అన్నదమ్ముల అనుబంధం’లో ఆయనతో కలిసి నటించాను. నా పలు చిత్రాలలో ఆయన ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. గిరిబాబు మంచి నటుడు మాత్రమే కాదు… మంచి వ్యక్తి కూడా. ఆయన లేని లోటు తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గిరిబాబు తనయుడు రఘుబాబుకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.- నందమూరి బాలకృష్ణ







