ఫిబ్రవరికి వాయిదా పడిన విశ్వక్ సేన్ లెగసీ!
యంగ్ హీరో విశ్వక్ సేన్(Viswaksen) నటిస్తున్న సినిమాల రిలీజ్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా కల్ట్(Cult) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో, ఈ ఇయర్ మరో రెండు సినిమాలను రిలీజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నగరానికి ఏమైంది రిపీట్(ENE Repeat) ఈ వీకెండ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు డిసెంబర్ 4న రిలీజ్ కావాల్సిన పొలిటికల్ డ్రామా లెగసీ(Legacy) వాయిదా పడినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ మొదటి వారంలో పలు సినిమాలు థియేటర్లలోకి రానుండటంతో పోటీని నివారించేందుకు లెగసీ మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్ కు తగినంత టైమ్ కేటాయించాలనే ఆలోచన కూడా ఈ వాయిదాకు మరో కారణంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
సాయికిరణ్ రెడ్డి(Sai Kiran Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఏక్తా రాథోడ్(Ektha rathod), రావు రమేష్(Rao Ramesh), సచిన్ ఖేడేకర్(Sachin Khedkar), మురళీ మోహన్(Murali mohan), కేకే మీనన్(KK Menon) కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ దగుమాటి(Yashwanth Dagumati), సాయికిరణ్ రెడ్డి(Sai Kiran Reddy) సంయుక్తంగా నిర్మిస్తుండగా, గోవింద్ వసంత్(Govind Vasanth) మ్యూజిక్ ను అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత విశ్వక్ సేన్ స్వయంగా లెగసీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. కొత్త రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.







