రిషబ్ శెట్టి కోసం మలయాళ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. రెండు సినిమాల డీల్?
కాంతార(kanthara)తో రిషబ్ శెట్టి(Rishab shetty) రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. యాక్టర్ గా, డైరెక్టర్ గా తన మార్కెట్‌ను భారీగా పెంచుకున్న ఆయన ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మలయాళ డైరెక్టర్ చిదంబరం (Chidambaram) ఆయనతో రెండు సినిమాలు తెరకెక్కించేందుకు డిస్కషన్స్ జరుపుతున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. మంజుమ్మల్ బాయ్స్(manjummal boys) తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చిదంబరం, రిషబ్‌తో కలిసి కొత్త కాంబినేషన్‌ను సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ రెండు సినిమాల్లో మొదటి సినిమా స్పోర్ట్స్ డ్రామాగా ఉండనుందని సమాచారం. కథ, పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. రెండో ప్రాజెక్ట్ ఏ జానర్లో ఉంటుందనే విషయంలోనూ ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈ రెండు సినిమాలను నిర్మాత షిబు తమీన్స్(Shibu thameens) నిర్మించనున్నట్లు తెలుస్తుండటంతో ప్రాజెక్టులపై అంచనాలు మొదలయ్యాయి. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది.
మరోవైపు చిదంబరం ఇటీవల బాలన్: ది బాయ్(baalan: the boy) తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆ సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు రిషబ్ శెట్టి లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోతో చేసే సినిమా ఆయన కెరీర్‌కు మరో కీలక అడుగుగా మారొచ్చు. కాగా రిషబ్ ప్రస్తుతం జై హనుమాన్(jai Hanuman) తో పాటు ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్(the pride of bharath: chatrapathi shivaji maharaj) తో బిజీగా ఉన్నారు.








