తెల్ల కాగితంకు భారీ రిలీఫ్..
చిన్న సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర సరైన స్పేస్ దొరకడం కూడా సక్సెస్ కు కీలకంగా మారుతోంది. ప్రస్తుతం తెల్ల కాగితం(thella kagitham) సినిమాకు అలాంటి పరిస్థితులే కలిసొస్తున్నాయి. యూత్‌ఫుల్ కంటెంట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఓపెనింగ్ రెస్పాన్స్ ఆశాజనకంగా ఉండగా, పోటీగా నిలిచే అవకాశం ఉన్న ఆదర్శ కుటుంబం(Adarsha kutumbam) పోస్ట్ పోన్ అవడం ఎక్స్ట్రా బెనిఫిట్ గా మారింది. దీంతో రానున్న రోజుల్లో థియేటర్లలో తన ఉనికిని మరింత బలంగా చాటుకునే అవకాశం ఈ సినిమాకు లభించింది.
సాధారణంగా పెద్ద సినిమాల మధ్య రిలీజయ్యే మిడ్ బడ్జెట్ సినిమాలకు మొదటి రెండు మూడు రోజుల్లోనే కలెక్షన్ల కోసం ప్రెజర్ ఉంటుంది. అయితే తెల్ల కాగితం విషయంలో ప్రస్తుతం ఆ ఒత్తిడి కొంత తగ్గినట్టే కనిపిస్తోంది. స్కూల్ లైఫ్, ఫస్ట్ లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ బాండింగ్స్ ను కలిపిన కథ కావడంతో వివిధ వర్గాల ఆడియన్స్ కు చేరువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా చూసిన ఆడియన్స్ నుంచి వచ్చే మౌత్ టాక్ రాబోయే రోజుల్లో దీనికి ప్రధాన బలంగా మారొచ్చు.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న అసలు ఛాన్స్.. దొరికిన ఖాళీని ఎంతవరకు ఉపయోగించుకుంటుందన్నదే. థియేటర్లలో డైరెక్ట్ పోటీ తక్కువగా ఉన్న టైమ్ లో పాజిటివ్ టాక్ మరింత మంది ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకురాగలిగితే కలెక్షన్లలో నిలకడ సాధించే అవకాశం ఉంటుంది. భారీ అంచనాలున్న సినిమాల మధ్య కాకుండా తనకంటూ స్పెషల్ ఆడియన్స్ ను తెల్ల కాగితంకు ప్లస్‌గా మారొచ్చు. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లు, మౌత్ టాక్ దాని తదుపరి ప్రయాణాన్ని నిర్ణయించనున్నాయి.








