మళ్లీ సెట్స్ పైకి బాలయ్య.. దాదాకు ఇక జోరే!
నందమూరి బాలకృష్ణ(nandamuri Balakrishna) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కొంతకాలంగా షూటింగ్‌కు దూరంగా ఉన్న బాలయ్య(balayya) మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. గోపీచంద్ మలినేని(gopichand malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాదా(dada) సినిమా షూటింగ్లో తిరిగి పాల్గొనేందుకు ఆయన మైసూర్ చేరుకున్నారు. షూటింగ్లో గాయపడటంతో సర్జరీ చేయించుకున్న బాలకృష్ణ దాదాపు రెండు నెలల పాటూ రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టడంతో మేకర్స్ లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం నుంచి మైసూర్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
రీఎంట్రీ ఇచ్చిన వెంటనే బాలయ్య ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా షూటింగ్‌ను ఫాస్ట్ గా పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దాదాపు 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన కీలక భాగం పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు బాలకృష్ణ లేని సీన్స్ ను డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇప్పటికే షూట్ చేశారు. దీంతో హీరో తిరిగి రావడంతో పెండింగ్‌లో ఉన్న కీలక షూట్‌ను పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఇక వచ్చే నెలలో బాలయ్య సాంగ్స్ షూటింగ్ లో పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి
షూటింగ్లో వచ్చిన బ్రేక్ ఎఫెక్ట్ రిలీజ్ డేట్ పై పడకుండా దాదాను అనుకున్న టైమ్‌కే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై టీమ్ ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 24న సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్ తో వర్క్స్ సాగుతున్నాయి. బాలయ్య కూడా షూటింగ్ విషయంలో ఎలాంటి ఆలస్యం, అనవసర విరామాలు ఉండకుండా పూర్తి చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కాజల్(kajal) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్(thaman) మ్యూజిక్ అందిస్తున్నారు. పెద్ది(peddi) ఫేమ్ వెంకట సతీష్ కిలారు(venkata satish kilaru) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.








