విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘కళ్యాణం కమనీయం జీవితం’ ఫస్ట్ లుక్ విడుదల
మీ ప్రయాణం ఇది ఒక గర్వకారణమైన ఆరంభం!- విజయేంద్ర ప్రసాద్
బాహుబలి, బజరంగీ భాయిజాన్, RRR, అలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారణాసి వంటి అద్భుత చిత్రాలకు కథలను అందించిన ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు వి. విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా కళ్యాణం కమనీయం జీవితం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ జరగడం మా చిత్ర బృందానికి ఎంతో గౌరవంగా నిలిచింది.
నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ – “ది గ్రేట్ స్టోరీ రైటర్ విజేయంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం మా అదృష్టం. ఇది మా విడుదల ప్రయాణంలో తొలి అడుగు మాత్రమే… త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్నాం.
చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిన అనంతరం, విడుదల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జరిగిన ఈ వేడుకలో చిత్ర నటీనటులు, సాంకేతిక బృందం పాల్గొని ఈ ప్రత్యేక క్షణాన్ని మరింత చిరస్మరణీయంగా మార్చారు. “అన్నారు.








