జైలర్2 రిలీజ్‌పై సస్పెన్స్.. మారుతున్న పరిణామాలతో ప్లాన్‌లో మార్పులు?
సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్2(Jailer2) చుట్టూ ఇప్పుడు రిలీజ్ డేట్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ డేట్ కు సినిమా రావడం అనుమానమేనన్న ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీపావళి సీజన్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ ను వాయిదా వేసే అవకాశం ఉందనే ఊహాగానాలు బలపడుతున్నాయి. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి మాత్రం ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు.
ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ విషయంలోనూ కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. డైరెక్టర్ నెల్సన్(Nelson) కొన్ని సీన్స్ ను మరోసారి తెరకెక్కించే పనిలో ఉన్నారని, ఇందుకోసం రజినీకాంత్ కూడా సెట్స్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని రాజకీయ నేపథ్య సంభాషణలు, సన్నివేశాలను ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాలకు అనుగుణంగా మార్చే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మార్పులు కథలో ఎంతవరకు ప్రభావం చూపుతాయనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు నెల్సన్ ఒకేసారి రీషూట్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్(Sun pictures) భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అనిరుధ్(Anirudh) అందిస్తున్న మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. రీషూట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తైన తర్వాతే జైలర్2 రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.








