Mrunal Thakur: నాపై నాకు నమ్మకం కలగడానికి టైమ్ పట్టింది
ఇండస్ట్రీలో టెలివిజన్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్(Mrunal thakur) ఆ తర్వాత సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సీతారామం(Sitaramam) మూవీలో సీతగా కనిపించి అందరి మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్న మృణాల్, తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించడంతో పాటూ తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.

మృణాల్ ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది(Siddhanth chaturvedi) తో కలిసి దో దివానే సెహర్ మే(Do Diwane sehar mein) అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తోంది మృణాల్. తనకు చిన్నప్పటి నుంచే ఓ సమస్య ఉందన్న విషయాన్ని మృణాల్ బయటపెట్టింది.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మొదటి నుంచి కూడా తనకు ఆత్మ విశ్వాసం తక్కువని, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే తనకు సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరిగిందని చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కూడా తనకు ఆత్మవిశ్వాసం లేదని, రీసెంట్ గా రిలీజైన సన్ ఆఫ్ సర్దార్2(Son of sardar2) వరకు కూడా తన గురించి తనకు పెద్దగా కాన్ఫిడెన్స్ ఉండేది కాదని, కానీ ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందని ఆమె చెప్పింది. నాపై నాకు నమ్మకం కలగడానికి ఇంత టైమ్ పట్టిందా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుందని మృణాల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.















