“ఇడుపు కాయితం” ‘శ్రీలత..’ సాంగ్ కు ప్రతి ఒక్కరి ప్రశంసలు లభిస్తున్నాయి – మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, గీత రచయిత అలరాజు
ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘శ్రీలత..’ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు ఈ పాటకు దక్కుతున్న ఆదరణపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ
– ‘శ్రీలత..’ పాట మా ఫ్యామిలీ మెంబర్స్ కు బాగా నచ్చింది. వాళ్లు ఫోన్స్ చేసి పాట బాగుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మా సాంగ్ కు రెస్పాన్స్ బాగుంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ పాటలో నేను నటించాను. ఈ ఆలోచన బన్నీ వాస్ గారిది. మీరు ఇన్ని సాంగ్స్ కు మ్యూజిక్ చేశారు. మీరు ఎవరో ప్రేక్షకులకు తెలియాలి కదా అని ఈ సాంగ్ లో నేను కూడా నటించేలా చేశారు. నేను ప్రజలకు తెలియాలి అనే ఆలోచన నాలో కూడా ఉండేది. అందుకే ఒక ప్రైవేట్ సాంగ్ నేనే పర్ ఫార్మ్ చేస్తూ చేయాలని కూడా అనుకున్నాను. పాటలో నటించడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ పాటలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను.
– ఈ పాట కోసం డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే సినిమాలోని కథలో భాగమవుతూ, ప్రమోషన్ కు కూడా ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాం. పాటలో క్యాచీ లిరిక్స్ కూడా కుదిరాయి. ప్రజలు ఈ పాటను ఓన్ చేసుకునేలా ఉండాలని డిజైన్ చేసి ముందే రిలీజ్ చేశాం. ట్యూన్ పాడుతుంటే లిరిక్ రాశాడు గీత రచయిత అలరాజు. ఈ పాటకు ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయి. పాట అందరికీ రీచ్ అవ్వాలనే కంప్లీట్ గా తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు. చరణం మెలొడియస్ గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశాను.
– లిరిక్ రైటర్ అలరాజు అన్న డైరెక్టర్ వంశీరెడ్డి అన్నకు ఫ్రెండ్. నాకు కూడా అలరాజు అన్న తెలుసు. ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో ఐడియా ఉంది. ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరిచితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటకు కనెక్ట్ అయ్యారు. పాట బాగుందని కాల్ చేసిన చెబుతున్నారు.
– ఈ చిత్రంలో ఆరు పాటలతో పాటు కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి. ఆల్బమ్ మొత్తం బాగా వచ్చింది. నాకు పర్సనల్ గా పాటలన్నీ సంతృప్తినిచ్చాయి. ప్రతి సినిమాకు సంతోషిస్తాం కానీ అందులో సందర్భానికి వచ్చే పాటలు కొన్నే ఉంటాయి. ఈ చిత్రంలో ప్రతి పాట సందర్భానికి తగినట్లు ఉంటుంది. నెక్ట్స్ రిలీజ్ చేయబోయే సాంగ్ కూడా అదిరిపోతుంది. మ్యూజిక్ కు ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రమిది. పెళ్లి ఎపిసోడ్ పాట, కొత్త జంట విలేజ్ కు వెళ్లివచ్చేప్పుడు పాట..ఇలా కథలోని సందర్భాలకు మంచి సాంగ్స్ కుదిరాయి. ఇది పూర్తిగా తెలంగాణ నేపథ్య సినిమానే అయితే మ్యూజికల్ గా అందరికీ రీచ్ అయ్యేలా పాటల్లో కమర్షియల్ టచ్ ఇచ్చాం.
– మా నాన్న స్టేజి ఆర్టిస్టు, అమ్మ పాటలు బాగా పాడేది. అలా నాకు పాటతో చిన్నప్పటి నుంచే అనుబంధం ఏర్పడింది. నేను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి ట్రూప్ లో ఉండేవాడిని. పాటలతో నా ప్రయాణం అలా మొదలైంది. వరంగల్ మ్యూజిక్ కాలేజ్ లో సంగీతం నేర్చుకున్నా. ఆఫీస్ గా పనిచేశా, సౌండ్ ఇంజినీర్ గా మారాను. ఆ అనుభవంతో మ్యూజిక్ కంపోజర్ గా ఎదిగాను. మన సినిమాల్లో తెలంగాణ బాణీ పెరగడం చూస్తుంటే సంతోషంగా ఉంది. నేను గతంలో కొన్ని ఛానెల్స్ కోసం తెలంగాణ నేపథ్య సాంగ్స్ కంపోజ్ చేశాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాటలు రూపొందించాను.
– ప్రస్తుతం క్రేజీ కల్యాణం, దేత్తడి, తెల్లకాగితం వంటి చిత్రాలను మ్యూజిక్ చేస్తున్నా. వీటితో మరికొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి.
లిరిక్ రైటర్ అలరాజు మాట్లాడుతూ
– నేను ఇప్పటిదాకా దాదాపు 40 చిత్రాలకు సాంగ్స్ రాశాను. నేను రాసిన పాటల్ల మైల్స్ ఆఫ్ లవ్ మూవీలోని తెలియదే తెలియదే పాట మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు. బాపు సినిమాలో కంగారే పడకురా అనే పాట కూడా బాగా హిట్ అయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. శ్రీలత పాట రిలీజ్ కాగానే కాసర్ల శ్యామ్ గారు మెసేజ్ పంపారు. లిరిక్స్ చాలా గొప్పగా ఉన్నాయి. కొన్ని లైన్స్ బాగున్నాయని అభినందించారు. ఏ పంచాయితీ మన నడిమిట్ల వచ్చినా, మన మంచానికి అవి తెలియద్దే…అనే లైన్ ఆయనకు బాగా నచ్చింది. ఇడుపుకాయితం అనే టైటిల్ ను సాహిత్యంతో జస్టిఫై చేసేందుకు బాగా ప్రయత్నించావు అంటూ కాసర్ల శ్యామ్ ప్రశంసించారు.
ఈ పాట రాసేప్పుడు డైరెక్టర్ వంశీ రెడ్డి గారు కథతో సంబంధం లేకుండా ఈ పాట అందరికీ నచ్చేలా ఉండాలి. సినిమా చూశాక ఇంకా శ్రోతలకు కనెక్ట్ కావాలని చెప్పారు. మీరు ఇప్పుడు ఆడియో వింటుంటే నచ్చుతుంది. కానీ సినిమాలో చూసినప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా ఈ పాటను ఇష్టపడతారు. హీరో హీరోయిన్స్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది. శ్రీలత అలకకు కారణం ఏంటి, శ్రీనివాస్ ఏం చెప్పి ఆమెను బుజ్జగించాడు అనే నేపథ్యంతో ఈ సాంగ్ రూపకల్పన చేశారు. రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్స్ కాకుండా ఈ పాట సాహిత్యం కొత్తగా రాసేందుకు ప్రయత్నించాను.
టైటిల్ రివీల్ చేసేందుకు ముందగానే ఈ పాట ఫైనల్ అయ్యింది. ఈ పాటలోని పదాలను పూర్తిగా ఫోక్ స్టైల్ లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశాను. ఒక పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నానే ప్రెషర్ నాపై ఉండేది కానీ వాళ్లు ఇచ్చిన ఇన్ పుట్స్ వల్ల కంఫర్ట్ గా లిరిక్స్ రాశాను. శ్రీలత పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇడుపుకాయితం గీత రచయితగా నా బతుకు మార్చిన కాగితం అనుకుంటాను.








