టీ సర్వ్ చేయడం నుంచి పాన్ ఇండియా క్రేజ్ వరకు!
ఒకప్పుడు కర్ణాటకకు చెందిన సాధారణ యువకుడిగా సినిమా అవకాశాల కోసం తిరిగిన యష్(Yash), నేడు భారతీయ సినీ పరిశ్రమలో మోస్ట్ ఇంపాక్టెడ్ పాన్ ఇండియా స్టార్లలో ఒకరిగా నిలిచారు. బీఎంటీసీ బస్ డ్రైవర్ కొడుకైన యష్, పెద్దగా ఆర్థిక వనరులు లేకుండానే బెంగళూరుకు చేరుకుని నటుడిగా తన జర్నీని ప్రారంభించారు. థియేటర్లో బ్యాక్‌స్టేజ్ వర్క్స్ చేస్తూ, రోజుకు సుమారు ₹50 సంపాదించే టీ అందించే పనులు కూడా చేశారు. అదే టైమ్ లో యాక్టింగ్ లోని మెళకువలను నేర్చుకుంటూ తన టార్గెట్ పై దృష్టి నిలబెట్టుకున్నారు.
థియేటర్, టెలివిజన్ ఎక్స్‌పీరియెన్స్ తర్వాత కన్నడ సినిమాల్లో అడుగుపెట్టిన యష్, ప్రారంభ దశలోనే మంచి గుర్తింపు సంపాదించారు. మొగ్గిన మనసు(Moggin manasu), గూగ్లీ(Googly) వంటి సినిమాలు యష్ ను యంగ్ హీరోగా నిలబెట్టినా, 2018లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్1(KGF1) ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా భాషా పరిమితులను దాటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, కేజీఎఫ్ చాప్టర్2(KGF2) ఆ సక్సెస్‌ను మరింత విస్తరించి యష్‌ను నేషనల్ లెవెల్ స్టార్‌గా నిలిపింది.
ప్రస్తుతం యష్ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దశలో ఉన్నారు. టాక్సిక్(Toxic) సినిమాలో హీరోగా నటించడంతో పాటు కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే నితీష్ తివారి రూపొందిస్తున్న రామాయణ(Ramayana) ద్విభాగ సినిమాలో రావణుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులు ఆయన స్థాయిని మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టాలను ఎప్పుడూ భయపడలేదని, అవి తన ప్రయాణంలో సహజ భాగమని యష్ పలుమార్లు చెప్పిన మాటలు, సాధారణ ఆరంభాల నుంచి అసాధారణ విజయాలను సాధించవచ్చని నిరూపించే ఉదాహరణగా నిలుస్తున్నాయి.








