అనుపమ హింట్ ఇచ్చిందా?
అనుపమ పరమేశ్వరన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి ఆమె పర్సనల్ లైఫ్ పై వస్తున్న ప్రచారమే దీనికి కారణం. కొంతకాలంగా యాక్టర్ ధృవ్ విక్రమ్‌తో రిలేషన్లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ కొత్త ఊహాగానాలకు తెరతీసింది. వరుస ఫోటోలను షేర్ చేస్తూ, ఫోటో డంప్‌కు సారీ… ఇక ఎవరైనా అప్రూవల్ కోసం, పాట ఎంపిక కోసం లేదా ఇంకెవరి క్యాప్షన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకపోతే పోస్టింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుందనే అర్థం వచ్చే క్రిప్టిక్ క్యాప్షన్‌ను జత చేసింది. ఈ కామెంట్ ను చూసిన ఫ్యాన్స్ ఇది ధృవ్ విక్రమ్‌తో బ్రేకప్‌కు సంబంధించిన సంకేతమేమో అంటూ డిస్కషన్ మొదలుపెట్టారు.
ఈ పోస్టు తర్వాత మరో విషయం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అనుపమ ప్రస్తుతం ధృవ్ విక్రమ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవడం లేదని కొందరు గుర్తించి, బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూర్చారు. గతేడాది నుంచి వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం కొనసాగుతోంది. లీకైన స్పాటిఫై ప్లేలిస్ట్, సోషల్ మీడియా ఇంటరాక్షన్స్, పబ్లిక్ ఈవెంట్స్‌లో కలిసి కనిపించడం వంటి అనేక సంఘటనలు ఆ వార్తలకు ఊతమిచ్చాయి. అయినప్పటికీ ఇప్పటివరకు అనుపమ గానీ, ధృవ్ గానీ తమ రిలేషన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు అనుపమ క్యాప్షన్ స్పష్టంగా బ్రేకప్ను సూచిస్తోందని భావిస్తుండగా, మరికొందరు అది కేవలం పర్సనల్ ఎమోషన్ ను వ్యక్తపరిచే సాధారణ పోస్ట్ మాత్రమేనని అంటున్నారు. అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయినా, ఈ ఒక్క పోస్ట్‌తో అనుపమ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది.








