Budget 2026: రంగాల వారీగా నిధుల కేటాయింపులు ఇలా..
Budget 2026:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పన, దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం రూ. 53.5 లక్షల కోట్ల బడ్జెట్లో రవాణా, రక్షణ రంగాలు సింహభాగాన్ని దక్కించుకున్నాయి.
రంగాల వారీగా నిధుల కేటాయింపులు (కోట్లలో):
ప్రధాన రంగాలకు కేటాయించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.
- రవాణా (Transport): మౌలిక సదుపాయాల బలోపేతానికి అత్యధికంగా ₹5,98,520 కోట్లు కేటాయించారు.
- రక్షణ రంగం (Defence): దేశ భద్రత కోసం ₹5,94,585 కోట్లు కేటాయింపులు జరిగాయి.
- గ్రామీణాభివృద్ధి: పల్లెల ప్రగతికి ₹2,73,108 కోట్లు కేటాయించారు.
- హోం శాఖ: అంతర్గత భద్రత కోసం ₹2,55,234 కోట్లు కేటాయించారు.
- వ్యవసాయం: అన్నదాతల సంక్షేమం, అనుబంధ రంగాల కోసం ₹1,62,671 కోట్లు కేటాయించారు.
- విద్య: విద్యా రంగానికి ₹1,39,289 కోట్లు దక్కాయి.
- వైద్యారోగ్యం: ప్రజారోగ్యం కోసం ₹1,04,599 కోట్లు కేటాయించారు.
- పట్టణాభివృద్ధి: నగరాల అభివృద్ధి కోసం ₹85,522 కోట్లు కేటాయించారు.
- ఐటీ, టెలికం: డిజిటల్ పురోగతి కోసం ₹74,560 కోట్లు కేటాయించారు.
- వాణిజ్యం, పరిశ్రమలు: పారిశ్రామిక వృద్ధి కోసం ₹70,296 కోట్లు కేటాయించారు.






