జో బైడెన్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం
ప్రాణాంతక క్యాన్సర్లపై పోరులో మరింత అత్యాధునిక పరిశోధనలకు మార్గం సుగమం చేసేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రెసిషల్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ప్రోగ్రామ్ అనే కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పరిధిలోని అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఫర్ హెల్త్ (ఆర్పా`హెచ్)లో భాగంగా దీనికి నిధులు సమకూర్చునున్నారు. శస్త్రచికిత్సలు చేసే సమయంలో క్యాన్సర్ కణాలేవో, ఆరోగ్యకర కణాలేవో వైద్యులు అత్యంత కచ్చితంగా గుర్తించే సాంకేతికతలను ఆవిష్కరించడం దీని ప్రధాన లక్ష్యం. వ్యాధిని వేగంగా, మెరుగ్గా నయం చేసేందుకు ఆ సాంకేతికతలు దోహదపడతాయని బైడెన్ ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి ఆలోచనలు కూడా స్వీకరించనున్నారు.






