వైట్‌హౌస్ డిప్యూటీ సెక్రటరీపై వేటు
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ టీజే డక్లోపై సస్పెన్షన్ వేటు విధించారు. వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ టీజే డక్లోను వారం రోజుల పాటు జీతం లేకుండా సస్పెండ్ చేసినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి చెప్పారు. ఓ విలేఖరిని వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ టీజే డక్లో బెదిరించడం ఆమోదయోగ్యం కాదనే సందేశమిచ్చేందుకు తాము ఆయనపై సస్పెన్షన్ వేటు విధించామని జెన్ సాకి తన వైట్‌హౌస్ ప్రెస్ బ్రీఫింగ్లో మీడియా తెలిపారు. వైట్‌హౌస్ డిప్యూటీ సెక్రటరీ టీజే డక్లోకు ఆక్సియోస్ రిపోర్టర్ అలెక్సీ మెక్ కామండ్ తో శృంగార సంబంధం ఉన్నట్లు పొలిటికోకు చెందిన రిపోర్టర్ తారా పామెరీ కథనం రాశారు. దీంతో వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ టీజే డక్లో విలేఖరి తారాపామెరీని బెదిరించారు. వైట్‌హౌస్ టీజే డక్లోపై సస్పెన్షన్ వేటు విధించడంతో ఆయన విలేఖరి తారాపామెరీకి క్షమాపణలు కోరారని వైట్ హౌస్ ప్రెసె సెక్రటరీ జెన్ సాకి తెలిపారు.






